2019 వ సంవత్సరం చివర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కమ్ బ్యాక్ ప్రకటించారు. ఇంకా వకీల్ సాబ్ తో పాటు హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ ఇంకా అలాగే సురేందర్ రెడ్డి చిత్రాలు వరుసగా ప్రకటించారు.అయితే వీటిలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి చేసింది మాత్రం ఒక్క వకీల్ సాబ్ సినిమా మాత్రమే. ముందుగా ఒప్పుకున్న హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలు పక్కనపెట్టి భీమ్లా నాయక్ సినిమాని పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీరమల్లు సినిమా కొంత భాగం చిత్రీకరణ జరిగాక పవన్ కళ్యాణ్ ఆ సినిమాని హోల్డ్ లో పెట్టాడు. ఇక భవదీయుడు భగత్ సింగ్ సినిమా అయితే ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్ళలేదు.ఇక ఈ భవదీయుడు భగత్ సింగ్ చిత్రానికి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకుడు కాగా... movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనుకున్న ప్రకారం ఈ మూవీ కనుక మొదలైతే సగానికి పైగా షూటింగ్ పూర్తి కావాల్సింది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో పాటు మధ్యలో భీమ్లా నాయక్ సినిమా చేయడం వలన చాలా ఆలస్యమైంది.


సగం షూటింగ్ పూర్తి చేసుకున్న హరి హర వీరమల్లు సినిమా పరిస్థితే అర్థం కాకుండా ఉంది. అక్టోబర్ నెల నుండి పవన్ బస్సు యాత్ర చేయనున్నారు. ఇక భవదీయుడు భగత్ సింగ్ సినిమా సెట్స్ పైకి వెళ్లడం జరగని పని అని నిర్మాతలు భావిస్తున్నారు. ఒక వేళ ఈ మూవీ కార్యరూపం దాల్చినా కానీ అది కనీసం రెండేళ్ల తర్వాతే.ఈ ప్రాజెక్ట్ ని అనుకున్నప్పుడే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ పవన్ కి రూ. 40 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారట. అంత పెద్ద మొత్తం పవన్ కళ్యాణ్ దగ్గర ఆగిపోవడం ఇంకా అలాగే మరో వైపు సినిమా గందరగోళంలో పడడంతో అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కోరుతున్నారట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ప్రముఖంగా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: