కన్నడ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో హిట్ , సూపర్ హిట్ ,  బ్లాక్ బస్టర్ మూవీ లతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సుదీప్ 'ఈగ' సినిమాతో తెలుగు లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి , సైరా నరసింహారెడ్డి లాంటి భారీ బడ్జెట్ తెలుగు మూవీ లలో నటించి తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ను సుదీప్ సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుదీప్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విక్రాంత్ రోనా అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే కన్నడ తో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే మంచి షో కే మంచి పాజిటివ్ టాక్ లభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కి మంచి కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన 'రా రా రకమ్మ' సాంగ్ కి ఏ రేంజ్ ఆదరణ దక్కిందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడానికి ఈ సాంగ్ కూడా ప్రధాన కారణంగా మారింది. ఈ సాంగ్ థియేటర్ లలో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ ఫుల్ వీడియో ను ఆగస్ట్ 12 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ కి అజనీష్ లోకాంత్ సంగీతాన్ని అందించగా , అనూప్ బండారి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: