సనాతన హిందూ ధర్మం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీపాన్ని స్వయంగా దేవుడి రూపంగా భావిస్తూ ఉంటారు ఎంతో మంది హిందువులు. ఈ క్రమంలోనే  ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పూజా, వివాహ, నూతన గృహప్రవేశం లాంటి కార్యక్రమాలలో కూడా దీపాన్ని వెలిగించడం ప్రస్తుతం భారత సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎలాంటి శుభకార్యాన్ని చేయాలనుకున్నా కూడా హిందూ ధర్మం ప్రకారం దీప ప్రజ్వలన చేసిన తర్వాతే అన్ని పనులు మొదలు పెడుతూ ఉంటారు. అందుకే దీపం వెలిగించే టప్పుడు ఎంతోమంది నిష్ఠగా ఉంటారు అని చెప్పాలి. కానీ ఇటీవలి కాలంలో ఎంతోమంది దీపాలను అంతగా లెక్కచేయడం లేదు. కాళ్ళకి ఉన్న పాదరక్షలు కూడా వదలకుండా అని దీప ప్రజ్వలన చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి సమయంలో అందరికీ మరోసారి సనాతన హిందూ ధర్మాన్ని గుర్తుచేసింది తమన్నా భాటియా. తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. దశాబ్ద కాలానికి పైగానే స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే దీప ప్రజ్వలన కార్యక్రమానికి హాజరైంది తమన్నా.


 ఇక నేటి రోజుల్లో ట్రెండ్కు తగ్గట్టు గానే ప్రతి ఒక్కరు బూట్లు చెప్పులు వేసుకుని దీప ప్రజ్వలన చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తమన్నా దీపం వెలిగించాల్సిన సమయం వచ్చింది. అక్కడ అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించకుండా.. తన కాలికి ఉన్న చెప్పులను దూరంగా వదిలేసింది తమన్నా. ఇలా చెప్పులను  దూరంగా విడిచి అప్పుడు దీపం వెలిగించింది. దీంతో తమన్నా చేసిన పనికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. హీరోయిన్ అయినప్పటికీ మోడ్రన్  లైఫ్ లో అందరి కంటే ముందు ఉన్నప్పటికీ ఇంకా సనాతన ధర్మాన్ని పాటిస్తూన్న తమన్నా  నిజంగా గ్రేట్ అంటూ ఎంతోమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: