శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన నిఖిల్ 'హ్యాపీ డేస్' మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. నిఖిల్ ఆ తర్వాత స్వామి రా రా ,  కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా  వంటి వైవిధ్యమైన కథాంశాలతో తెరకెక్కిన మూవీ లలో హీరోగా నటించి ఆ మూవీ లతో బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు.

ఇలా ఉంటే నిఖిల్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచి పోయిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో తాజాగా నిఖిల్ హీరోగా నటించాడు. తాజాగా ఈ మూవీ విడుదల అయ్యింది. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా  , చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఇప్పటికే మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విడుదల అయిన తర్వాత కూడా నిఖిల్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు.  తాజాగా ఓ ఇంటర్వ్యూ లో నిఖిల్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... కార్తికేయ 2 మూవీ కంటెంట్ పై మాకు మాంచి నమ్మకం ఉంది , కా కపోతే ప్రస్తుతం పరిస్థితులు కాస్త అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా కంగారు పడ్డాము. జనాలు థియేటర్ లలో వస్తారా... మూవీ ని చూస్తారా అని ఇలా ఎన్నో ఆలోచనలు. మూవీ కి మంచి టాక్ వచ్చిన తరువాత మేము చాలా సంతోషంగా ఫీలయ్యాము. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తుండటం ఈ మూవీ కి బాగా కలిసొచ్చిన అంశం.  గతంలో పిల్లలకు అమ్మమ్మలు ... నాన్నమ్మలు చందమామ కథలను  చెప్పేవారు అలాగే పిల్లలు కూడా వాటిని ఎంతో శ్రద్ధగా వినేవారు. అలా ఒక చందమామ కథ మాదిరిగానే కార్తికేయ 2 మూవీ ని చూపించాము అంటూ తాజా ఇంటర్వ్యూలో భాగంగా నిఖిల్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: