కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్ లు దక్కాయి. అలాగే ప్రస్తుతం కూడా ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు బింబిసార మూవీ 14 రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.

మరి 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. నైజాం : 10.28 కోట్లు , సీడెడ్ : 6.82 కోట్లు , యూ ఏ : 4.46 కోట్లు , ఈస్ట్ : 1.76 కోట్లు , వెస్ట్ : 1.32 కోట్లు , గుంటూర్ : 2.03 కోట్లు ,  కృష్ణ : 1.48 కోట్లు ,  నెల్లూర్ : 85 లక్షలు .14 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో బింబిసార మూవీ 29 కోట్ల షేర్ ,  45.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.06 కోట్లు . ఓవర్ సీస్ లో : 2.20 కోట్లు . ప్రపంచ వ్యాప్తంగా 14 రోజుల్లో బింబిసార మూవీ 33.26 కోట్ల షేర్ , 55.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. బింబిసార మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించగా , క్యాథరిన్ , సంయుక్త మీనన్మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: