సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో చాలా బిజీగా గడుపుతుంది.ఇప్పటికే ఈమె యశోద, శాకుంతలం, ఖుషి వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా సమంత హిందీలో వెబ్ సిరీస్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.మొత్తానికి సమంత వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్న నేపథ్యంలో ఈమెకు టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు.ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించాడు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభించడం చాలా ఆలస్యం అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం సమంతకు వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. కొరటాల శివ ఎన్టీఆర్ సమంత కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎలాంటి హిట్ అయిందో మనకు తెలిసిందే.


ఇంకా ఈ క్రమంలోనే ఈ కాంబినేషన్లో మరొక సినిమా వస్తుందని భావించిన అభిమానులకు ఇప్పుడు చేదు అనుభవం ఎదురయింది. ఎన్టీఆర్ 30 వ సినిమాలో నటించే అవకాశం సమంతకు ఇవ్వగా ఈ సినిమా కోసం సమంతకు రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు.అయితే ప్రస్తుతం సమంతకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఈమె ఏకంగా ఈ సినిమాకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.ఇలా ఎన్టీఆర్ 30వ సినిమాకి సమంత ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఈమె అడిగిన మొత్తం ఇవ్వని పక్షంలో ఈ సినిమాని వదులుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశం వచ్చి సమంత రిజెక్ట్ చేసిందని తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు సమంతపై కాస్త గుర్రుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: