హైపర్ ఆది కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు ఒక రైటర్ గా కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. ఇటీవలి కాలంలో ఈ టీవీలో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలకు కూడా హైపర్ ఆది స్క్రిప్ట్ అందిస్తున్నాడు అని చెప్పాలి. బుల్లి తెరపై అతని డామినేషన్ ఎలా ఉంటుందో అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్క్రిప్ట్ రాసేది అతనే కాబట్టి అతనీకీ అనుకూలంగానే పంచులు రాసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఢీ షో లో ఆది తో బిగ్బాస్ ఫేమ్ అఖిల్ కూడా టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే హైపర్ ఆది ఎన్నో రోజుల నుంచి అస్సలు అఖిల్ కి కామెడీ చేయడం రాదని.. రాసిచ్చిన పంచ్ లను కూడా సరిగా చెప్పలేడు అనే విధంగా మళ్లీ ప్రేక్షకులను నమ్మించాడు.
ఇటీవలే విడుదలైన ప్రోమో చూసుకుంటే మాత్రం మొన్నటి వరకు ఎంతో సైలెంట్ గా ఉండి పోయిన అఖిల్ ఇక ఇప్పుడు ఏకంగా హైపర్ ఆది పైన ఆటో పంచులు వేస్తూ ఆశ్చర్య పరిచాడు అని చెప్పాలి. ఇన్ని రోజుల పాటు ఎప్పుడూ ఆదిపై పంచులు వేయని అఖిల్.. ఇక ఇప్పుడు వరుస పంచులు వేయడంతో ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. హైపర్ ఆది కి ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా కౌంటర్లు వేస్తూనే వున్నాడు. ఇక ఇటీవల విడుదలైన డీ షో ప్రోమో చూస్తే మీరు కూడా ఆశ్చర్య పోతారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి