కొంతమంది హీరోలకు కథలు రాయడం ఎంతో కష్టం. ఎందుకంటే వారికి ఉన్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ సినిమాలను కోరుకుంటూ ఉంటుంది. అందుకే దర్శకులు వారికి కథలు రాయాలి అంటే ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ హీరోలకు కథలు రాయడం వెనక ఎంతో ఇబ్బంది దాగి ఉందని కొంతమంది దర్శకులు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. మొహమాటంగా కథలను రాసి సదరు హీరోల ముందుకు తీసుకు వస్తే వారు రిజెక్ట్ చేయడం కొన్ని రోజులు పని చేసిన తరువాత ఆ కథలో పసలేదని సినిమాను పూర్తిగా పక్కన పెట్టడం వంటివి జరుగుతున్నాయి.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంతమంది సీనియర్ హీరోలు ఉన్నారు. 50 ఏళ్ళు దాటినా కూడా వారు అగ్ర హీరోలుగా రాణిస్తూ ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో అలరిస్తూ ఉన్నారు. అయితే ఈ హీరోలకు దర్శకులు కథలు రాయలేక వారికోసం ఇతర భాషలోని కథలను అరువు తెచ్చుకుంటూ వాటిని సదరు సీనియర్ హీరోల బాడీ లాంగ్వేజ్ కి వయసుకు తగ్గట్లుగా మార్చుకొని వాటిని సినిమాలుగా చేసి విడుదల చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు మన సీనియర్ హీరోలు చేస్తున్న సినిమాలు దాదాపుగా రీమేక్ సినిమాలే కావడం ఇదే నిజం అని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాల్లో రెండు సినిమాలు రీమేక్ సినిమాలే. గాడ్ ఫాదర్ సినిమా మలయాళం లోని లూసిఫర్ సినిమాకు రీమేక్ చేయగా బోళాశంకర్ సినిమాను తమిళ పరిశ్రమంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమా కి రీమేక్ గా రూపొందిస్తున్నారు. ఇక వెంకటేష్ మొన్నటిదాకా వరుసగా రీమేక్ సినిమాలో చేయడం మనందరికీ తెలిసిందే. నాగార్జున కూడా ఒకటో రెండో రీమేక్ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఒక బాలకృష్ణ మాత్రమే స్ట్రైట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే రాజశేఖర్ వంటి సీనియర్ హీరోలు అందరూ కూడా రీమేక్ ల వైపే చూస్తూ ఉండడం వారికి కథలు దొరకడం లేదు అన్నది స్పష్టంగా తెలియపరుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి