టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈరోజు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు తన తుది శ్వాస విడిచారు.గత కొంతకాలం నుంచి కూడా అనారోగ్య సమస్యల కారణంగా బాధపడుతున్న కృష్ణంరాజు ఏఐజి హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు స్టార్స్ ఆయన అభిమానులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే తాజాగా కృష్ణం రాజు మరణానికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కృష్ణంరాజు గత నెల రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటున్నాడట. అయితే ఈ విషయాన్ని బయటకు రానివ్వని రెబల్ స్టార్ ఫ్యామిలీ.. తాజాగా నిన్న సాయంత్రం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రభాస్ కి కబురు పెట్టారట. దీంతో హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్ళిన ప్రభాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. 


బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న ప్రభాస్ చాలా భాధాగా హాస్పిటల్ లోపలకి వెళ్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు.అయితే ఆయన హాస్పిటల్ నుంచి వచ్చిన కొద్ది గంటలకే కృష్ణం రాజు మరణించారట. ఆ టైంలో కుటుంబ సభ్యులు ఎవరు అక్కడ లేరని సమాచారం.అంతేకాదు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవిని హాస్పిటల్లోకి రానివ్వలేదట ప్రభాస్. కృష్ణం రాజు పరిస్థితి అంత దారుణంగా ఉందని ముందుగానే ఆమెకు కృష్ణంరాజును ఐసీయూలో చూపించి పంపించేసారట. అంతేకాదు కృష్ణం రాజు చనిపోయారని ప్రభాస్ మొదటి చెప్పింది కూడా శ్యామల దేవికే నట . డాక్టర్స్ ఆయనకు చెప్పిన మరోక్షణం ప్రభాస్ కన్నీరు మున్నీరుగా విలపించారని ఆ తర్వాత ఆ విషయాన్ని శ్యామలాదేవికి చెప్పే సాహసం ఎవ్వరు చేయలేకపోయారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.ఏది ఏమైనా రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు చనిపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: