టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలు ఒక సినిమాని వదుకుకున్నారు అనే వార్తలే మనం వింటుంటాం గాని హీరోయిన్ లు వదులుకున్నారు అని చాలా తక్కువ వింటుంటాం...ఇదిలావుంటే ఇక ఇప్పుడు ఆ లిస్టులోకి అలనాటి హీరోయిన్ చేరిపోయింది సదా. ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇప్పుడిప్పుడే.. అయినప్పటికీ ఈమె బుల్లితెరపై ప్రోగ్రాములలో కూడా కనిపిస్తూ ఉన్నది.  సదా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు నటించే అవకాశాన్ని వదులుకున్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం...హీరోయిన్ సదా మొదటి నటించిన చిత్రం జయం అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక  ఈ చిత్రంతోనే ఈమె మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పటికి హీరోయిన్  సదా ఆ సినిమాలోని చెప్పిన డైలాగులు సైతం అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి.. తర్వాత అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తను ఎంచుకొనే కథలు సరిగ్గా లేకపోవడం వల్ల ఆమె కెరియర్ అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మరొకసారి తన హవా కొనసాగించాలని చూస్తోంది సదా. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా రాణించాలని చాలా ఆత్రుతతో ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ఈ క్రమంలోనే చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని హీరోయిన్ సదా  వదులుకున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా తమన్నా ఎంపిక అవ్వడం జరిగింది.. అసలు విషయంలోకి వెళ్తే..భోళా శంకర్ సినిమాలో టాలీవుడ్  హీరోయిన్ సదా ఒక చిన్న పాత్ర కోసం సంప్రదించారట.కాగా ఐటెం సాంగ్ లో నటించిన తర్వాత ఒక పది నిమిషాల పాటు కామెడీ క్యారెక్టర్ కు ఆఫర్ చేయగా..టాలీవుడ్ హీరోయిన్  సదా మెగాస్టార్ సినిమా అయినప్పటికీ తను ఐటెం సాంగ్లో నటించడానికి ఇష్టపడలేదట అందుచేతనే ఆ సినిమాని వదులుకున్నట్లుగా సమాచారం.ఇక ఈ ఆఫర్ శ్రీముఖికి వెళ్లినట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: