దర్శకుడి గా , నటుడి గా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచు కున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లలో నటించడం మరియు తమిళ మూవీ లకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా తెలుగు మూవీ లకు కూడా దర్శకత్వం వహించి ,  తెలుగు మూవీ లలో కూడా నటించాడు  తాజాగా విడుదల అయిన సీతా రామం అనే మూవీ లో కూడా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు శింబు ప్రధాన పాత్రలో పెరకెక్కిన ది లైఫ్ ఆఫ్ ముద్దు అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది.  

మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాజాగా మాట్లాడుతూ ...  అల్లు అర్జున్ తో కలిసి పని చేయడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అని , అతని కోసం నా దగ్గర ఇప్పటికే అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది అని ,  అది త్వరలోనే జరుగుతుంది అని ఆశిస్తున్నాను అంటూ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాజాగా చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాగ చైతన్య , నాని వంటి తెలుగు హీరోల మూవీ లకు దర్శకత్వం వహించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరి కొన్ని రోజుల్లో రామ్ పోతినేని హీరో గా తేరకేక్కబోయే సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: