బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తాజాగా లైగర్ అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.  భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. ఇలా ప్రేక్షకులను బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా మెప్పించ లేకపోయినా ఈ మూవీ తాజాగా అనగా ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 23 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో ప్రసారం అవుతుంది. ఇది ఇలా ఉంటే లైగర్ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా తెలుగు సినీ ప్రేమికులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ మూవీ విడుదలకు ముందు అనన్య పాండే కు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అదిరిపోయే క్రేజీ ఆఫర్ లు వచ్చినట్లు ,  దానితో ఈ ముద్దు గుమ్మ సినిమాకు దాదాపు 4 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే కొంత మంది ప్రొడ్యూసర్ లు కూడా ఈ ముద్దు గుమ్మ కు 4 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ కాగా లైగర్ మూవీ విడుదల అయ్యి గోరా పరాజయం చెందిన తర్వాత తెలుగు ఫిలిం మేకర్లు అనన్య పాండే కు ఆ రేంజ్ లో పారితోషకం ఇవ్వడానికి కాస్త వెనకాడుతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే లైగర్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ అనన్య పాండే కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రం మంచి క్రేజీ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: