టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు ఈమె. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా దిల్ రాజు ఈ సినిమాను సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇదిలా ఉంటె ఇక సమంత గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆమె...నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. 

అంతెందుకు నేను జెస్సీ పాత్రలా కామ్ గా ఉండనని ఆమె తెలిపారు. ఇక నేను చీరను క్యారీ చేయడానికి చాలా కష్టపడ్డానని సమంత అన్నారు.అంతెందుకు  కాలేజ్ లో ఉన్న సమయంలో మోడలింగ్ చేసేదానినని అలా యాడ్స్ లో ఛాన్ వచ్చి నెమ్మదిగా నటించానని సమంత అన్నారు.ఇక  నేను జెస్సీ అంత సీరియస్ కాదని ఆమె పేర్కొన్నారు.అయితే  ఎనిమిదో తరగతిలో సీనియర్ నా ఫస్ట్ క్రష్ అని ఆమె కామెంట్లు చేశారు.ఇకపోతే మా ఫాదర్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి అని ఆమె తెలిపారు. ఇక నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని సమంత అన్నారు.

అయితే సినిమాల్లోకి వచ్చినా నేను పర్సనల్ గా ఏమీ మారలేదని సమంత చెప్పుకొచ్చారు. ఇక ప్రతి అమ్మాయి తన జీవితంలో కన్ఫ్యూజన్ ను ఫేస్ చేస్తుందని సమంత తెలిపారు. ఇకపోతే ఏ మాయ చేశావె కథ వినకుండా ఆ సినిమాలో నటించానని సమంత చెప్పుకొచ్చారు.అంతేకాదు మొదటి సన్నివేశంలో నటించే సమయంలో నాకు డైలాగ్ లేకపోయినా నా చేతులు వణికాయని సమంత అన్నారు. అయితే నేను అసలు రొమాంటిక్ కాదని సామ్ అన్నారు. ఇక సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలావుంటే సినిమాసినిమాకు సమంతకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. ఇక సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: