ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్ చిత్రాలలో 'సీతారామం' ఒకటి. ఇండియన్‌ క్లాసికల్‌ లవ్‌స్టోరీ మూవీస్‌ లిస్ట్‌లో ఈ చిత్రం టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది.
దుల్కర్‌ సల్మాన్, మృనాళ్‌ థాకూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించింది.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ లభించింది. కమర్షియల్‌గానూ ఈ చిత్రం మంచి  వసూళ్ళను సాధించింది. ఇక ఇటీవలే ఈ చిత్రాన్ని  హిందీలో  విడుదల చేయగా.. అక్కడ కూడా విపరీతమైన  రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ‘మహానటి’ చిత్రంతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్‌ ఈ చిత్రంతో ఇక్కడ మంచి మార్కెట్‌ను  ఏర్పరుచుకున్నాడు.

ఇక ఓటీటీలోనూ ఈ చిత్రం మంచి వ్యూవర్‌షిప్‌ను సాధించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తాజాగా 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మేకర్స్‌ ఎడిటింగ్‌లో తీసేసిన ఓ సీన్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో చాలా కాలంగా పాకిస్థాన్‌ ఆర్మీ బందిఖానాలో దుల్కర్‌, సుమంత్‌ ఉంటుండగా.. పాకిస్థాని ఆర్మీ జనరల్‌ సచిన్‌ ఖెడెకర్‌ రామ్‌ వద్దకు వచ్చి ‘నేను చేయగలిగేది ఏమైనా ఉంటే చెప్పు’ అని అంటాడు. ఆ తర్వాత దుల్కర్‌, సుమంత్‌ను కాసేపు బయటకు వస్తారు. ఇక అక్కడే ఫుట్‌బాల్‌ అడుతున్న వారిని చూసీ.. వీరిద్దరూ ఆ ఫుట్‌బాల్‌తో ఓ గేమ్‌ ఆడుతారు. అందులో సుమంత్‌ గెలుస్తాడు. దాంతో దుల్కర్‌ ‘విష్ణు సార్‌ మళ్ళీ కూడా మీరే గెలిచారు’ అంటాడు. దాంతో బాధతో, కోపంతో సుమంత్‌, దుల్కర్‌ కాలర్‌ను పట్టుకుని ‘నేను గెలవడం ఏంట్రా.. అంతా నీవళ్లే.. మనమినిక్కడ ఎన్ని రోజులు ఉన్నామో కూడా తెలియదు. పుట్టింది అమ్మాయో, అబ్బాయో కూడా తెలియదు అన్యాయం రా.. నేను నీ లాగా అనాధను కాదు, నాకోసం కుటుంబ ఎదురు చూస్తుంది’ అని అంటుంటాడు.

ఇంత మంచి సీన్‌ మూవీలో ఉండి ఉంటే బాగుండేది అని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పీరియాడికల్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటించింది. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా ముఖ్య పాత్రలో నటించింది. సుమంత్‌, తరుణ్‌భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమాస్ బ్యానర్‌లపై అశ్వినీదత్, స్వప్న దత్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: