ఒకే లాంటి కథతో తెరకెక్కిన సినిమాలు ఒకేసారి విడుదలైతే ఎలా ఉంటుంది. టాలీవుడ్‌ అనే కాదు.. ఎక్కడైనా కానీ ఇలాంటి పరిస్థితి చాలా తక్కువగా వస్తుంది.


టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితి ఇటీవల వస్తుంది అనుకున్నా.. అనుకోని కారణాల వల్ల మిస్‌ అయ్యిందట . అయితే ఆలస్యంగా వచ్చినా.. ఇప్పుడు ఆ రెండు సినిమాల గురించే మాట్లాడుతున్నారట.. ఆ సినిమాలే నాని - నజ్రియా 'అంటే సుందరానికీ', నాగశౌర్య - షిర్లే సేథియా 'కృష్ణ వ్రింద విహారీ'. ఈ సినిమాల్లో కామన్‌ విషయాలు ఒకటి కాదు.. చాలానే ఉన్నాయి. అందుకే ఈ చర్చ నడుస్తోంది.


ఒకే తరహా కథ.. డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లే సినిమాలు చాలా వచ్చాయి. అయితే చాలావరకు దగ్గరగా ఉన్న సినిమాలు కొన్నే ఉంటాయి. ఇప్పుడు చెప్పిన 'అంటే సుందరానికీ', 'కృష్ణ వ్రింద విహారీ' అలాంటివే. హీరో బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు కావడం, ఇంట్లో కట్టుబాట్లతో ఇబ్బంది పడటం లాంటివి రెండు సినిమాలూ కూడా ఉంటాయి. రెండు సినిమాల్లో బామ్మ పాత్ర ఒకేలా ఉంటుంది. ఏం చేయాలన్నా, ఏం చేసినా ఆచారాలు, మడి అంటూ వారు అంటుంటారు.


 


'అంటే సుందరానికీ' సినిమాలో హీరోను తండ్రి ఇబ్బంది పెడుతుంటే.. 'కృష్ణ వ్రింద విహారీ' సినిమాలో తల్లి పాత్ర ఇబ్బంది పెడుతుంది. ఇక కథానాయిక పాత్రకు పిల్లలు పుట్టరని తెలిసి తనకు లోపం ఉందని హీరో అబద్ధం చెప్పడం, పెళ్లికి ఒప్పించడం అనే పాయింట్ మాత్రం రెండింట్లోనూ సేమ్ టు సేమ్. అయితే ఈ పాయింట్‌ను డీల్ చేసిన విధానం రెండింటిలో మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. దీంతో 'అంటే సుందరానికీ' సినిమా చూసినవారు 'కృష్ణ వ్రింద విహారి' చూస్తే.. ఎక్కడో చూసినట్లే ఉందే అనిపిస్తుందట.


 


ఈ క్రమంలో ఈ రెండు సినిమాలూ ఒకేసారి వచ్చి ఉంటే.. ఎలా ఉండేది, సినిమాల ఫలితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చేవి అనేది ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. ఆ సినిమా ఫలితం, ఈ సినిమా ఫలితం ఇంచుమించు ఒక్కటే. కాబట్టి సరిపోయింది. అదే రెండూ ఒకేసారి వచ్చి ఉంటే ఇంకా దారుణంగా ఉండేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: