టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు.. ఎందుకంటే ఈయన మొదటి నుండి విభిన్న కథలతో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కుంటూ వచ్చాడు..అయితే అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించు కున్నాడు.కాగా  నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో.. ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో కొత్త సినిమా చేస్తున్నాడు.

అయితే  ఈసారి న్యాచురల్ స్టార్ మాస్ ప్రేక్షకులకు గురి పెట్టినట్టు అనిపిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో 'దసరా' సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సాలిడ్ మాస్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.. ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.కాగా  నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అయితే గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమా 2023 మార్చి 30న రిలీజ్ కాబోతున్న

ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు.  ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు నాని.. నానిసినిమా ఫస్ట్ సింగిల్ గురించి తాజాగా ఒక మాసివ్ అనౌన్స్ మెంట్ చేసాడు.. ఇక ఇంట్రెస్టింగ్ ప్రొమోషనల్ సాంగ్ తో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు..అంతేకాదు  ధూమ్ ధామ్ దోస్తానా అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు నాని అనౌన్స్ చేసారు.. ఇక ఈ ప్రొమోషనల్ వీడియో అందరిని ఆకట్టు కుంటుంది. అయితే ఈ సాంగ్ ను సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసినట్టు నాని తెలిపారు.. మరి ఈ సాంగ్ ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: