టాలీవుడ్ లో హీరోగా రాణించి బాలీవుడ్ కి వెళ్లిన హీరోలు చాలామందే ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ప్రేక్షకులను సంతృప్తి పరచడం అంత ఈజీ కాదని సినిమా వర్గాలు ఎప్పటినుండో అంటున్న మాటే. ఎందుకంటే బాలీవుడ్ లో ఉన్న ప్రేక్షకుల అభిరుచిని ఊహించడం చాలా కష్టం. అదే విధంగా ప్రస్తుతం ఒక స్టార్ హీరో అలాగే బాలీవుడ్ కు వెళ్లి కష్టపడుతున్నాడు. ఆయన మరెవ్వరూ కాదు రెబల్ స్టార్ ప్రభాస్... సినిమా సినిమాకు తనలో ఉన్న టాలెంట్ ను బయట పెడుతూ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న పాన్ ఇండియా హీరోలలో ప్రభాస్ టాప్ లో ఉన్నాడు.

ముఖ్యంగా బాహుబలి లాంటి ఎపిక్ సినిమా తర్వాత ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది అతని స్థాయి. మొదటిసారిగా బాహుబలి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడంతో బాలీవుడ్ లో మంచి సక్సెస్ ను అందుకుని అక్కడ కూడా తనకు ఫ్యాన్స్ ను సృష్టించుకున్నాడు. ఆ తర్వాత అదే ఫ్యాన్స్ ఉన్నారన్న ధైర్యంతో సాహో మరియు రాధే శ్యామ్ సినిమాలను రిలీజ్ చేశాడు. కానీ సాహో పర్వాలేదనిపించినా రాధే శ్యామ్ బాగా దెబ్బేసింది. ముఖ్యంగా మేక్ అప్ మరియు డబ్బింగ్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల పట్ల  టాలీవుడ్ ఫ్యాన్స్ అయితే సంతృప్తిగా లేరు.

తాను చేసే సినిమాల విషయంలో కొన్ని మార్పులు చేయకపోతే టాలీవుడ్ లో కెరీర్ ఉండకపోవచ్చని కొందరి అభిప్రాయం. కానీ ప్రభాస్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా వరుసగా పాన్ ఇండియా సినిమాల మీదనే దృష్టిని సారించి కన్నడ మరియు హిందీ వాసనలు ఉన్న సినిమాలనే చేస్తున్నారు. త్వరలో వచ్చే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు ఆ కోవకు చెందినవే. సో.. త్వరలో మంచి తెలుగు నేటివిటీ ఉన్న సినిమాను ప్రభాస్ చేయాలని ఆశిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: