టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సుదీర్ఘకాలం నుంచి తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుంటే ఇక ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలలో నటిస్తున్న బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ nbk107 సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు.ఇక ఈ వయసులో కూడా నటసింహం నందమూరి బాలకృష్ణ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేసుకుంటూ దోసుకుపోతున్నాడు.... 

ఇదిలావుంటే ఇక గత ఏడాది కెరీర్‌లోనే తొలిసారి హోస్ట్ గా మారి `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` అనే టాక్ షోను చేసిన సంగతి తెలిసిందే.ఇక ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ ఆహా వేదికగా ప్రసారమైన ఈ షో ఏ రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అంతేకాదు తనదైన హోస్టింగ్ తో బాలయ్య తన అభిమానులనే కాదు ప్రేక్షకులందరినీ ఫిదా చేశారు. ఇకపోతే అన్‌స్టాపబుల్ సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఇటీవల సీజన్ 2 కు సంబంధించి టీజర్‌ కూడా బయటకు వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

 కొద్ది రోజుల్లో తొలి ఎపిసోడ్ ను స్క్రీనింగ్ చేసేందుకు ఆహా టీమ్ సన్నాహాలు చేస్తోంది.ఇకపోతే ఈ సంగతి పక్కన పెడితే అన్‌స్టాపబుల్ సీజన్ 2 కు బాలయ్య డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే అసలింతకీ ఆయన ఎంత పుచ్చుకుంటున్నారో తెలిస్తే కళ్లు తేలేస్తారు.ఇక  సీజన్ 1కు బాలయ్య రెండున్నర కోట్లు తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.అయితే ఈ షో మంచి విజయం సాధించింది.అంతేకాదు  పైగా సీజన్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ నేపథ్యంలోనే బాలయ్య సీజన్ 2 కోసం రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: