నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం దసరాసినిమా షూటింగ్ కూడా చాలా శరవేగంగా జరుపుకుంటోంది. ఇక నాని ఎప్పుడూ కూడా చాలా డిఫరెంట్ ఉండే పాత్రలో సినిమాలను మాత్రమే చేస్తూ ఉంటారు. ఇక నాని గతంలో ఎన్నో సినిమాలు విడుదల అవ్వగా అవన్నీ భారీ డిజాస్టర్ ని చవిచూశాయి. కానీ శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు కానీ ఆ తర్వాత మళ్లీ అంటే సుందరానికి సినిమాతో ఫ్లాప్ గా మిగిలింది. అయితే ఈ రెండు చిత్రాలు మాత్రం సంతృప్తి ఇవ్వలేదని టాక్ మాత్రం వినిపిస్తోంది. ప్రస్తుతం అతని నమ్మకం మొత్తం దసరా సినిమాపైనే ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంతో తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ కారణాలవల్ల మధ్యలో ఆగిపోవచ్చు అనే టాక్ కూడా బాగా వినిపించింది. అంతేకాకుండా ఈ సినిమాని మరొక నిర్మాత ఆధీనంలోకి తీసుకున్నారని వార్తలు కూడా వినిపించాయి. అయితే నిర్మాత చేకూరి సుధాకర్ మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని తెలియజేశారు. ఇక ఇటీవల విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఊహించని విధంగా డిజాస్టర్ తో మూట కట్టుకున్నారు.దీంతో దసరా చిత్రాన్ని రూ. 50 కోట్ల రూపాయలు పెట్టుబడితో తీసుకువస్తున్నారు.


ముఖ్యంగా ఓటీటి హక్కుల ద్వారానే ఈ చిత్రానికి రూ. 30 కోట్ల రూపాయల వరకు వచ్చినట్లు సమాచారం. ఇక దసరా సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు కనుక ఈ సినిమాకు దాదాపుగా 10 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా మరొక రూ. 20 కోట్లు శాటిలైట్ ద్వారా రావచ్చని చిత్ర బృందం భావిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే.. 60 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపుగా నిర్మాత పెట్టిన పెట్టుబడిలో ఆల్మోస్ట్ వెనక్కి వచ్చినట్లే అని చెప్పవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం రూ  40 కోట్ల వరకు ఫ్రీ  రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: