అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన మోహన్ రాజా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హనుమాన్ జంక్షన్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకొని ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన మోహన్ రాజా ఆ తర్వాత తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. అందులో భాగంగా ఎన్నో తమిళ మూవీ లకు దర్శకత్వం వహించి , తమిళ సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మోహన్ రాజా ఏర్పరచుకున్నాడు.  

ఇది ఇలా ఉంటే తాజాగా మోహన్ రాజా , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే హిట్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు మోహన్ రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు మోహన్ రాజా అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో బాగంగా మోహన్ రాజా మాట్లాడుతూ ... ధ్రువ మూవీ కి సంబంధించిన సీక్వెల్ గురించి నేను చరణ్ ను కలుస్తూ ఉండేవాడిని. మొదట తనతో లూసిఫర్ రీమేక్ చేయమని చిరంజీవి గారు అనడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ మూవీ లో మరో స్టార్ హీరో కావాలని చిరంజీవి గారిని  అడగ్గా ఆయన సల్మాన్ ఖాన్ గురించి ప్రస్తావించారు. లూసిఫర్ మూవీ ని ఒక సారి చూడమని సల్మాన్ ఖాన్ కి చెప్పినా కూడా ఆయన చూడలేదు. చిరంజీవి గారి పక్కన కనిపిస్తే చాలు అని అనడం సల్మాన్ ఖాన్ గారి గొప్పతనం అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ రాజా చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: