కెరటం సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు అంతగా గుర్తింపు అయితే రాలేదు.


వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే మొన్నటి వరకు తిరుగులేని స్టార్ డమ్ తో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య కాస్త సినిమా అవకాశాలు రావడం లేదు. అడపాదడపా కొన్ని అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా ఆ సినిమాలు అంతగా హిట్ అవ్వడం లేదు.


ఇక దాంతో టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఇక అక్కడికి వెళ్ళాక ఈమె పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ప్రీత్ సింగ్ నటుడు,ప్రొడ్యూసర్ అయినటువంటి జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పబ్ లు,పార్టీలు అంటూ చెట్టా పట్టా లేసుకొని తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారట. ఏమాత్రం భయం లేకుండా బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారట. అయితే ఈ సంగతి ఆ నోటా ఈ నోటా రకుల్ కుటుంబ సభ్యుల దాకా వెళ్లిందట.


అంతే కాకుండా సినిమాల కోసమే ఇలా దిగజారిపోయి డేటింగ్ చేస్తుందని చాలా మంది ఆమెను విమర్శించడంతో వారి విమర్శలు వినలేని రకుల్ తల్లి కుల్విందర్ సింగ్ రకుల్ ప్రీత్ సింగ్ పై సీరియస్ అయినట్లు సమాచారం. ఇంకొకసారి వాడితో తిరిగితే బాగుండదు అంటూ వార్నింగ్ ఇచ్చిందట. వాడితో నువ్వు తిరగడం వల్ల మన ఫ్యామిలీ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి అని చెప్పినా కూడా రకుల్ వినకపోవడంతో ఇంకొకసారి వాడితో తిరిగితే చంపేస్తా అంటూ చాలా సీరియస్ గా రకుల్ తల్లి వార్నింగ్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: