సినిమాలను తెరకెక్కించే విషయంలో నిర్మాతలు కొంత ఆందోళన చెందడం ప్రతి సినిమాకు జరిగే విషయమే. కోట్ల డబ్బు వెచ్చించి రూపొందిస్తున్న సినిమా కాబట్టి ఆ చిత్రం ఏ విధంగా వస్తుందో ఏ విధంగా ప్రేక్షకులు దానిని తీసుకుంటారో ఎలాంటి వసూళ్లు సినిమా తీసుకువస్తుందో అన్న ఆందోళన వారిలో ప్రతిరోజు కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్న దిల్ రాజు ఓసినిమా విషయం పట్ల కొంత ఆందోళన చెందుతూ ఉండడం ఇప్పుడు కొంతమందిని ఆశ్చర్యపరుస్తుంది.

పంపిణీదారుడుగా తన కెరియర్ను ప్రారంభించిన దిల్ రాజు నిర్మాతగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను రూపొందించాడు. హీరోలకు చెప్పి మరి హిట్లు తెచ్చి పెట్టిన దిల్ రాజు పరిస్థితి ఇప్పుడేమీ బాగోలేదని చెప్పాలి. గత కొన్ని సినిమాలుగా ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆలదించలేకపోతున్నాయి. ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ సినిమాలను చేసే దిల్ రాజు ఇటీవల మాస్ ప్రేక్షకులను టార్గెట్ గా చేస్తూ సినిమాలు చేయగా అవి బాక్సాఫీస్ వద్ద ఆయనకు భారీ నష్టాలను తీసుకువచ్చాయి అని చెప్పాలి.

దీనికి తోడు పాన్ ఇండియా జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలోనే అగ్ర నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఆ తరహా సినిమాలు చేయాలనే ఒత్తిడి నెలకొంది. అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలసి ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాను చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన లీకులు బయటకు రావడం ఆయనను తెగ కలవర పెడుతున్నాయట. ఇటీవల కాలంలో సినిమాల యొక్క లీకులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాలకు ఇది తప్పడం లేదు. ఆ నేపథ్యంలో ఈ లీకులు బయటకు రాకుండా జాగ్రత్త వహించాలని చిత్ర బృందానికి ఆయన వెల్లడించాడట. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృంద సన్నహాలు చేస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న మరొక సినిమా వారసుడు సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశాడనీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: