పుష్పలో అల్లు అర్జున్ చాలా గ్రామీణ లుక్‌లో గడ్డంతో పాటు, పొడవాటి జుట్టు తో కనిపించాడు. అలాగే నాని గ్రామీణ నేపథ్యంలో సింగరేణి ఏరియాలో కార్మికుడిగా కనిపిస్తాడు. మేకర్స్ చాలా కాలం క్రితం అతని లుక్ ను రిలీజ్ చేశారు. గ్లింప్‌స్ చూస్తే, నాని పాత్రకు, బన్నీ ‘పుష్పరాజ్’ పాత్రకు పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటి పాట ‘ధూమ్ ధామ్ దోస్తాన్’కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లుంగీతో నారింజ రంగు షర్ట్‌లో ‘దాక్కో దాక్కో మేక’లోని బన్నీ లుక్ మెస్మ రైజ్ చేసిన విషయం తెలిసిందే. నాని లుక్ కూడా ఇంచు మించు అలాగే ఉంది.
ఈ సినిమాలో ‘వెన్నెల’ పాత్రలో కీర్తి సురేష్ లుక్ సోమ వారం విడుదలైంది. పోస్టర్‌లో ఆమె పసుపురంగు చీరలో ఆనందంగా డ్యాన్స్ చేస్తోంది. ఆమె లుక్ కేవలం ‘పుష్ప’లోని ‘శ్రీవల్లి’ పాత్రతో పాటు ‘రంగస్థలం’లో నటించిన ‘సమంత’ పాత్రను పోలి ఉంది. నెటిజన్లు దసరాపై ట్రోల్లింగ్ కు దిగారు. ఈ సినిమా పుష్ప సినిమా మాదిరిగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ''పుష్ప -2 మూవీ లేట్ అవుతుందని అంటున్నారు..కానీ త్వరగా షూటింగ్ పూర్తవుతుంది'' అంటూ దసరా సినిమాపై పంచులు వేస్తున్నారు. 'ఎస్‌ఎల్‌వి సినిమాస్' బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి