తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో కార్తీ ఒకరు. కార్తీ ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కార్తీ "యుగానికి ఒక్కడు" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆవారా  నా పేరు శివ , ఖాకీ ,  ఖైది వంటి మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన మార్కెట్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 21 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే తమిళ్ మరియు తెలుగు భాషలలో బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది  దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు కూడా లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సర్దార్ మూవీ లో రాసి కన్నా హీరోయిన్ గా నటించగా ,  పీ ఎస్ మిత్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇప్పటికే సర్దార్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన హిట్ టాక్ లభించడంతో ,   ఈ మూవీ యూనిట్ సర్దార్ 2 మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ప్రకటించింది. తాజాగా సర్దార్ మూవీ యూనిట్ సర్దార్ 2 మూవీ ఉండబోతుంది అని , ఈ మూవీ లో కూడా కార్తీ హీరోగా నటించినుండగా , పి ఎస్ మిత్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నట్లు ,  మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: