మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత తాజాగా యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ గా తెరకెక్కింది. ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో యశోద మూవీ పై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ ,  కన్నడ , మలయాళం ,  హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని నవంబర్ 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. 

మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ చేతల మీదగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. యశోద మూవీ యూనిట్ అక్టోబర్ 27 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు యశోద సినిమా తెలుగు ట్రైలర్ ను విజయ్ దేవరకొండ చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే యశోద మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలబడి ఉన్నాయి. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ స్పెషల్ సాంగ్ తో సమంత కు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ లభించింది. మరి యశోద మూవీ తో సమంత పాన్ ఇండియా రేంజ్ లో ఏ రేంజ్ క్రేజ్ ను సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: