తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన కార్తీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కార్తి నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలకు పార్ట్ 2 లు తెరకెక్కడానికి రెడీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కార్తీ మరి కొన్ని రోజుల్లో నటించబోయే సీక్వెల్ మూవీ ల వివరాలను తెలుసుకుందాం.

గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తేరికెక్కిన పొన్నియన్ సెల్వన్ అనే మూవీ లో కార్తీ ఒక కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తమిళ్ , తెలుగు , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ప్రపంచ వ్యాప్తంగా సాధించింది. పొన్నియన్ సెల్వన్ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ 2023 వ సంవత్సరంలో విడుదల చేయనున్నారు.  కార్తీ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఖైదీ మూవీ ఒకటి. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఖైదీ పార్ట్ 2 మూవీ  షూటింగ్ 2023 వ సంవత్సరంలో స్టార్ట్ కానుంది. ఇది ఇలా ఉంటే కార్తీ తాజాగా సర్దార్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం అక్టోబర్ 21 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది. తాజాగా సర్దార్ మూవీ కి పార్ట్ 2 ను తెరకెక్కించనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఇలా కార్తీ ఇప్పటికే మూడు సీక్వెల్ మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: