టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మోస్ట్ వెయిటింగ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా వీరి కాంబో లో మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాల్లో కూడా టాలీవుడ్ క్లాసిక్ సినిమాలు గా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను త్రివిక్రమ్ ఏ విధంగా చేస్తాడో అనేది చూడాలి.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క షూటింగ్ మహేష్ బాబు హాలిడే ట్రిపుకు వెళ్లిపోవడం వల్ల ఆగిపోయింది. ఇటీవలే ఆయన ఇండియాకు తిరిగి రావడం జరిగింది. దాంతో ఈ సినిమా తిరిగి మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫైనల్ గా త్రివిక్రమ్ ఈ సినిమాను మరొక క్లాసికల్ సినిమాగా చేయబోతూ ఉండడం ఆయన అభిమానులు ఎంతగానో సంబర పెడుతుంది. అయితే అదే అభిమానం ఆయన పై మరొక ఒత్తిడిని కూడా తీసుకువస్తుంది.

అదేమిటంటే ఈ దర్శకుడు పాన్ ఇండియా వైడ్ గా సినిమా చేయకపోవడం ఇతర దర్శకులు ఒకటి రెండు సినిమాలు చేయగానే విజయాలు సాధించగానే పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఈ దర్శకుడు మాత్రం ఇంకా రీజనల్ లాంగ్వేజ్ సినిమాలే చేస్తూ ఉండడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. మహేష్ బాబుతో సినిమానైనా ఆయన పాన్ ఇండియా వైడ్ గా చేస్తాడని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అది తెలుగు సినిమా గానే పరిగణించబడుతుంది. ఎందుకు ఈ దర్శకుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేయలేకపోతున్నాడు అర్థం కావడం లేదు. తొందరలోనే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వాలని వారు ప్రశ్నిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా చేసే సత్తా ఉన్న దర్శకులలో ఈ దర్శకుడు పేరు ముందు వరుసలో ఉంటుంది. మరి త్రివిక్రమ్ తదుపరి సినిమా నుంచైనా ఆ విధంగా ఆలోచనలు చేస్తే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: