విశ్వక్ సేన్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు... ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాలలొ కి ఇచ్చి  మంచి హిట్ టాక్ ను అందుకున్నాడు.విశ్వక్ సేన్‌కు వివాదాలు కొత్తేం కాదు. అంతకుముందు కూడా ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. సొంత కష్టంతో టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్. తనదైన యాటిట్యూడ్ తో యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఆ యాటిట్యూడ్‌ ఆయనకు కష్టాలు తెచ్చి పెడుతోంది.


ఇక విషయానికొస్తే.. కథానాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచన, నిర్మాణం, దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో ఎప్పుడో ప్రారంభించారు. తన కుమార్తె ఐశ్వర్యను ఈ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం చేస్తున్నారు అర్జున్.అయితే ఈ సినిమా విశ్వక్ సేన్ చేయడం లేదని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై స్పందించిన.. అర్జున్ సీరియస్‌గా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. కొన్ని సైట్స్ లో మా సినిమా నుంచి వీశ్వక్ సేన్ బయటకు వచ్చాడు అని వార్తలు వచ్చాయన్నారు. ఆ వార్తలు ఎందుకు వచ్చాయో తనకు తెలీదన్నారు.


అర్జున్, విశ్వక్‌సేన్ల వివాదం టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. విశ్వక్ సేన్ చేసిన దానిపై... అర్జున్... మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంచు విష్ణు కూడా స్పందించినట్లు సమాచారం.. సీనియర్ హీరోని ఇంతలా ఇబ్బంది పెట్టిన విశ్వక్ ని వెంటనే వివరణ అడుగుతానని.. ఎవ్వరైనా ఎంతటి వారైనా సీనియర్స్ కి మర్యాద ఇవ్వాల్సిందేనని, యాటిట్యూడ్ చూపిస్తే తోకలు కత్తిరిస్తా అని మంచు విష్ణు అన్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది..మరి ఈ వివాదం లోకి ఇంకేంత మంది వస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: