ఇక హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో సక్సెస్ అందుకున్న రమ్యకృష్ణ.. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన హవా కొనసాగిస్తూ బిజీగా ఉంది. రమ్యకృష్ణ కేవలం నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తరచుగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా రమ్యకృష్ణ కు సంబంధించి కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రాములు షేర్ చేయగా రమ్యకృష్ణ అందం ఇంకా పెరుగుతూనే ఉందంటూ పలువురు అభిమానులు , సినీ ప్రేక్షకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.ఐదు పదుల వయసు దాటినా కూడా యువ హీరోయిన్ లాగా తన అందాన్ని చూపిస్తోంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. లేటు వయసులో కూడా రమ్యకృష్ణ ఈ ఫోటోషూట్ అందరిని ఆకర్షిస్తోందని చెప్పవచ్చు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది రమ్యకృష్ణ. కానీ అంతగా ఆ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం తన భర్త తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది రమ్యకృష్ణ. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి