నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. క్రాక్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడం , అఖండ లాంటి మాస్ హిట్ తర్వాత బాలకృష్ణ హీరో గా నటిస్తున్న మూవీ కావడంతో వీర సింహా రెడ్డి మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు  కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే నిన్న ఈ మూవీ నుండి మొదటి పాటను ఈ చిత్ర బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ పాట విడుదల అయిన 24 గంటల సమయం లోనే 7 మిలియన్ ల వ్యూస్ ను మరియు 28 కే లైకు లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే వీర సింహా రెడ్డి మూవీ లోని మొదటి సాంగ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ ను అందించాడు. ఈ మూవీ కి తమన్ అద్భుతమైన ఆల్బమ్ ను అందించినట్లు తెలుస్తోం.ది అలాగే "బి జీ ఏం" ను కూడా అద్భుతమైన రేంజ్ లో ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: