తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచి గొప్ప నటులుగా ఎదిగిన వారిలో ఎన్టి రామారావు తర్వాత వినిపించే పేరు అక్కినేని నాగేశ్వరరావు. ఒకప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగి ఇక వినలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీని ముందుకు నడిపించారు ఈ ఇద్దరు హీరోలు. కాగా తెలుగు జాతి గర్వించదగ్గ అత్యున్నత వ్యక్తుల్లో ఇక నాగేశ్వర రావు ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ధర్మపత్ని అనే సినిమా ద్వారా ఒక చిన్న పాత్రలో నటించి ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేశారు అక్కినేని నాగేశ్వర రావు.


 ఇక ఆ తర్వాత నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర నటుడిగా ఎదిగారు అని చెప్పాలి. దశాబ్దాల పాటు తిరుగులేని ప్రస్తానాని కొనసాగించారు అక్కినేని నాగేశ్వరరావు. అంతే కాదు అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ లో అమ్మాయిల కలల రాకుమారుడుగా కూడా అక్కినేని నాగేశ్వరరావు ఒక వెలుగు వెలిగారు అని చెప్పడం లోనూ అతిశయోక్తి లేదు. వందల సినిమాల్లో నటించిన అక్కినేని చివరిగా నటించిన సినిమా మాత్రం అక్కినేని ఫ్యామిలీ సినిమాగా నిలిచిన మనం  అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దాసరి నారాయణరావు అక్కినేని కాంబినేషన్లో తెరకెక్కిన మాయాబజార్ సినిమాలో నాగేశ్వరరావు రమ్యకృష్ణ, సౌందర్య, రంభ, రోజా, మాలాశ్రీ లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి నటించారు. ఈ సినిమాలో ఒక పాటకు స్టెప్పులు వేశారు అక్కినేని. ఈ పాట అప్పట్లో అక్కినేని అభిమానులు అందరిని కూడా ఉర్రూతలూగించింది. అయితే అక్కినేని ఇక తన సినీ కెరియర్లో స్టెప్పులు వేసిన చివరి సినిమా మాత్రం ఇదే అని చెప్పవచ్చు. ఇక ఎంతో మంది యువ హీరోయిన్లతో అక్కినేని స్టెప్పులు వేస్తూ ఉంటే అభిమానులకు అది చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Anr