నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ అండ్ స్టాపబుల్ సీజన్ 1 కు కూడా హోస్ట్ గా వ్యవహరించాడు. అన్ స్టపబుల్  మొదటి సీజన్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 ను ఆహా నిర్వాహక బృందం ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లు కూడా విడుదల అయ్యాయి. ఈ టాక్ షో లో మొదటి ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు విచ్చేశా.రు అలాగే శర్వానంద్ , అడవి శేష్ ,  విశ్వక్ సేన్ ,  సిద్దు జొన్నలగడ్డ ఇలా కొంత మంది కూడా ఈ సీజన్ 2 కు వచ్చారు. ఇది ఇలా ఉంటే తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... అన్ స్టాపబుల్ సీజన్ 2 నెక్స్ట్ ఎపిసోడ్ కు ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్ లు మరియు ఒక టాప్ దర్శకుడు ముఖ్య అతిథులుగా రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  ఆ ప్రొడ్యూసర్ మరియు ఆదర్శకుడు ఎవరో కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించిన అల్లు అరవింద్ మరియు దగ్గుపాటి సురేష్ బాబు  వీరితో పాటు ఇప్పటికే 100 పైగా సినిమాలకు దర్శకత్వం వహించి , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కూడా ఈ టాక్ షో కి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన పనుల్లో ఆహా నిర్వాహక బృందం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: