టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మీక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు ఇక  ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ లిస్టులో కూడా ఈమె టాప్ లో త్రీ లో ఉంటుంది.

వరుస సినిమాలతో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకు అనుకోకుండా తన సొంత ఇండస్ట్రీ నుండే విమర్శలు వస్తున్నాయి.ఇక  దీనికి కారణం రష్మిక చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక  రష్మిక(rashmika) ఓ ఇంటర్వ్యూలో నేను సౌత్ ఇండియాలో మిగతా భాషలను మాట్లాడడానికి ఎలా ఇబ్బంది పడతానో కన్నడ మాట్లాడడానికి కూడా అంతే ఇబ్బంది పడతాను అని చెప్పి తన మాతృభాషను అవమానించి ఎన్నో ట్రోల్స్ కి గురైంది.అంతేకాదు అలాగే కన్నడ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతారా  సినిమా అసలు నేను చూడలేదు చూడ్డానికి టైం కూడా లేదు అని చెప్పి మరోసారి విమర్శల పాలయింది.  

ఈ విషయంలో కన్నడ ఇండస్ట్రీ ఈమని బ్యాన్ చేయాలని కూడా ఆలోచిస్తుందని ఎన్నో వార్తలు వస్తున్నాయి.  తాజాగా ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకునే కొన్ని సంస్థలు కూడా రష్మిక ను తీసేసే పనిలో ఉన్నట్లు సమాచారం.అయితే  మరీ ముఖ్యంగా ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఖజానా జ్యువెలరీ రష్మికను అందులో నుండి తీసేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ వార్తలు మాత్రం ఆగడం లేదు. రష్మికకు ఇలా వరుసగా జరగడానికి కారణం ఆ శాపమే అంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక అదేంటంటే కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతారా కర్ణాటక లోని రష్మిక వాళ్ళ తెగకు చెందిన దేవుడి నేపథ్యంలో వచ్చిన సినిమా.  అలాంటి దేవుడు సినిమాని రష్మిక చూడలేదు అని చెప్పడం వల్ల ఈమెకు తమ కుల దేవుడి శాపం తగిలింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: