సుడిగాలి సుధీర్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్  షో ద్వారా గుర్తింపు పొందిన నటుల్లో సుడిగాలి సుధీర్ ఒకరు. అందులో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి బుల్లితెర మెగాస్టార్ గా మారాడు. అలానే రష్మీ, సుధీర్ లా జోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిద్దరి కోసమే షోలను చూసే వాళ్లు ఉన్నారంటే వారి జోడికి ఉన్న క్రేజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అయితే అనుకోని కారణాలతో సుధీర్ జబర్దస్త్ షోను వదిలి వెళ్లాడు. దీంతో వారిద్దరి తో నడిచే షోల రేటింగ్ తగ్గిందనే వార్తలు కూడా వినిపించాయి. రష్మీతో కలసి సుధీర్ చేసిన సందడి మాములుగా ఉండేది కాదు. వారిద్దరు ఓ రేంజ్ లో కెమిస్ట్రీ పండించారు. కొంతకాలం నుంచి వారిద్దరు కలిసి పెద్ద కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో సుధీర్ ఫ్యాన్స్ కి ఓ మంచి శుభవార్త. తాజాగా సుధీర్ మరో అమ్మాయితో కలిసి స్టేజిపై డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుధీర్, రష్మీల కెమిస్ట్రీతో పలు షోలు టాప్ రేటింగ్ తో దూసుకెళ్లాయి. అందుకే మేకర్స్ కూడ సుధీర్ రష్మీల జోడీతో షోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సుధీర్, రష్మీల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని, త్వరలో వారిద్దరు పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వినిపించాయి. చాలామంది అనేక స్టేజి షోల్లో పెళ్లి ఎప్పుడంటూ రష్మీ, సుధీర్ లను అడిగే వారు. ఓ షోలో ఏకంగా వారిద్దరికి పెళ్లికూడా చేశారు. అంతలా బుల్లితెరపై బెస్ట్ జోడీగా రష్మీ, సుధీర్ గుర్తింపు పొందారు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షోల్లో యాంకర్లుగా వీరిద్దరే ఉన్నారు. ఈ జోడితో షోలకు కూడా మంచి రేటింగ్ వచ్చింది. ఇటీవల కొన్ని కారణాలతో సుధీర్ జబర్దస్త్ షోను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో వారిద్దరి జోడికి ఉన్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.సుధీర్ ఫ్యాన్స్ అయితే ‘ఇక నుంచి సుధీర్ అన్నతో  రష్మీని చూడలేం’ అంటూ బాధను వ్యక్తం చేశారు. బుల్లితెరపై సుధీర్ కి ఉన్న క్రేజ్ తో అతడికి ఎవరిని జోడిగా పెట్టిన షో దూసుకెళ్తుంది. అందుకే గతంలో పలువురు యాంకర్లతో కలిసి స్టేజిపై సందడి చేశాడు. ఈ మధ్యకాలంలో సుధీర్ అంతగా స్టేజిపై రోమాన్స్ సీన్ చేయడం లేదు. ఇక ఫ్యాన్స్ అయితే ఎపుడెప్పుడు సుధీర్ అన్న తిరిగి రష్మీతో లేదా కొత్తవారితోనైనా స్టేజిపై సందడి చేస్తాడా? అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సుధీర్ ఫ్యాన్స్ కి ఓ శుభవార్త. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన ‘స్టార్ మా పరివారం’ షోలో ఓ కొత్త అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేశాడు. వారిద్దరి జోడిని చూసిన అభిమానులు తెగ సంతోష పడ్డారు. సుధీర్ తో జోడి కట్టిన అమ్మాయి.. ‘పల్లకిలో పెళ్లికూతురు’ సీరియల్ లో శశిరేఖ పాత్రలో నటిస్తున్న అతిథి పండిట్.

ఉత్తరాదికి చెందిన ఈ అమ్మాయికి తెలుగులో ఈ సీరియలే మొదటిది. తొలి సీరియల్ తోనే తెలుగింటి అమ్మాయి పాత్రలో అతిథి పండిట్ అందరిని ఆకట్టుకుంది. ఇక తాజాగా ప్రసారమైన స్టార్ మా పరివారం షోలో ఈ అమ్మడు సుధీర్ తో కలిసి చిందులేసింది. వీరిద్దరి జోడి చూసిన చాలా మంది..బుల్లితెరకు మరో జోడి దొరికిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరు కలిసి షోల్లో సందడి చేస్తారని రూమర్స్ వినిపిస్తోన్నాయి. ఈ వార్తలో నిజమెంత? అనే విషయం పక్కన పెడితే.. ఈ బ్యూటీతో సుధీర్ చేసిన డ్యాన్స్ కి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు. సుధీర్.. ఈ కొత్త అమ్మడితో కలసి బుల్లితెరపై సందడి చేస్తాడా? లేదా?  అనేది ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: