టాలీవుడ్ హీరో అయిన సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అదితి రావు పుట్టిన రోజు సందర్భంగా తనతో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ..

నా హృదయ రాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సిద్ధూ పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం అయితే చేకూరింది. అంతేకాకుండా.. వీరు జంటగా చక్కర్లు కొట్టడం.. ఈవెంట్స్ కలిసి హజరవుతుండడంతో నిత్యం వీరికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా మరోసారి ఈ జంట కెమెరాకు అయితే చిక్కారు. ముంబైలోని ఓ హోటల్లో సిద్దూ.. అదితి కలిసి కెమెరా కు చిక్కిన ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే వీరిద్దరు తమ బంధం గురించి వస్తున్న వార్తలపై ఇప్పటివరకు వారు స్పందించలేదు.

యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన మహా సముద్రం లో అదితి రావు కథానాయికగా నటించింది. ఈ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీసిందని తెలుస్తోంది. వీరిద్దరికి ఇదివరకే పెళ్లిళ్లు అయి విడాకులు కూడా జరిగాయి. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని వివాహం చేసుకుని 2007లో విడాకులు అయితే తీసుకున్నారు. మరోవైపు అదితి కూడా చిన్న వయసులోనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని విడాకులు అయితే తీసుకుందట.

ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహారిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో పాల్గొన్న శర్వానంద్ సైతం.. సిద్ధూ.. అదితి రిలేషన్ షిప్ పై స్పందించిన విషయం తెలిసిందే. ఈ షోలో మహా సముద్రం హీరోయిన్ అదితీ రావు హైదరీ ప్రస్తావన తీసుకువచ్చారట బాలయ్య. నిజ జీవితంలో సిద్ధార్థ్ కు జంటగా అదితి మారిందా ?.. అని శర్వానంద్ ను అడిగారు. అందుకు శర్వా స్పందిస్తూ.. ఏమో నాకేం తెలియదు.. సిద్ధార్థ్ పోస్ట్ చూశాను. కానీ అది నాకు అర్థం కాలేదు అని కూడా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: