నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడులై ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ "హిట్: ది సెకండ్ కేస్". మొదట హిట్ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ఫ్రాంచైజీ గా వచ్చిన హిట్ సీక్వెల్ లో మాత్రం పాన్ ఇండియా హీరో అడవి శేష్ నటించడం జరిగింది. అందుకే ఈ సినిమాకు మొదటి నుడ్ని భారీ హైప్ ఉంది. అంచనాలకు తగినట్లుగానే విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్ లను అందుకుంటోంది అన్నది ట్రేడ్ వర్గాల టాక్. ఈ సినిమాకు నిర్మాతగా నాని మరియు దర్శకుడిగా శైలేషు కొలను ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించారు.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు హీరో మరియు డైరెక్టర్ లు ఇద్దరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తాము అని హింట్ ఇచ్చారు. దానికి తోడు హిట్ 2 హిట్ కావడంతో సోషల్ మీడియాలో  నెక్స్ట్ పార్ట్ పైన ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. సినిమాను చూసిన నెటిజన్లు అడవి శేష్ ను అభినందిస్తూనే హిట్ 3 కి సంబంధించిన సలహాలు ఇవ్వడం ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం. ఒకమ్మాయి అయితే హిట్ 2 లో ఒక సీరియల్ కిల్లర్ అబ్బాయిగా ఉండి అమ్మాయిలను టార్గెట్ గా పెట్టుకుని చంపాడు కదా... హిట్ 3 లో సీరియల్ కిల్లర్ గా అమ్మాయిని పెట్టండి అంటూ కాప్షన్ పెట్టింది.

ఈ కామెంట్ చూసిన అడవి శేష్ షాక్ అయ్యాడు. అయితే ఈమె ఇచ్చిన సలహా ఒకింత బాగానే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి డైరెక్టర్ శైలేషు కొలను ఈ పాయింట్ ను తీసుకుని సినిమాలో వాడుకుంటాడా లేదా అన్నది పూర్తిగా అతని ఇష్టానికే వదిలేయాలి. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమా యూనిట్ అంతా కూడా ఇప్పుడు హిట్ 2 ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి: