విక్రమ్ తిరగెక్కించే సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ తీసే సినిమాలలో ప్రతి ఒక్క పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ ఏమాత్రం మిస్ కాకూడదని త్రివిక్రమ్ ఆయన సినిమాల్లో పాత్రలకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే తీసుకుంటాడు .అయితే ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలోని ఒక  కీలక పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది .ఇక అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత త్రివిక్రమ్ దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకోవడం జరిగింది. దాని అనంతరం

 మహేష్ తో ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహేష్ బాబు అతడు, ఖలేజా వంటి క్లాసికల్ సినిమా హిట్ల అనంతరం వీళ్ళ కాంబినేషన్లో మూడవ సినిమాగా ఈ సినిమా రానుంది. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు .రెండో షెడ్యూల్ ప్రారంభం జరిగే లోపే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్ను మూయడం జరిగింది .దీనికిగాను కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ ను  ఆపేయడం కూడా జరిగింది. దీని అనంతరం డిసెంబర్ రెండు లేదా మూడు వారాలలో తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ సైఫ్ అలీఖాన్ ను తీసుకుంటున్నట్టు  తెలుస్తుంది .అయితే ఇదే గనుక నిజమైతే సైఫ్ అలీ ఖాన్ కు తెలుగులో ఈ సినిమా రెండవ సినిమా అవుతుంది .ఈయన ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ..ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది .మహేష్ బాబు ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు దీంతోపాటు శ్రీ లీల సెకండ్ హీరోయిన్గా నటించడం జరుగుతోంది. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అయిన తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా త్రివిక్రమ్ ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: