‘గుర్తుందా శీతాకాలం’ ‘పంచతంత్రం’ ‘ముఖచిత్రం’ ఈమూడు సినిమాలలో ఎదోఒకటి హిట్ కొట్టి కలక్షన్స్ తెచ్చుకుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేసాయి. ‘గుర్తుందా శీతాకాలం’ కన్నడలో విజయవంతం అయిన ‘లవ్ మాక్ టైల్’ ఆధారంగా తీసారు. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈమూవీలో సత్యదేవ్ తమన్నా మేఘా ఆకాష్ లాంటి ప్రముఖ నటీనటులు నటించడంతో ఈమూవీ కొంతవరకు బాగా ఉండవచ్చు అన్న ప్రేక్షకుల అంచనాలు తప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో ఇలాంటి కథలతో చాలసినిమాలు రావడంతో ప్రేక్షకులకు కొత్తదనం కనిపించలేదు అంటున్నారు. గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సత్యదేవ్ కెరియర్ కు ఈమూవీ పెద్దగా కలిసిరాకపోవచ్చు అంటున్నారు. ఈమూవీ చూసిన సగటు ప్రేక్షకుడు నో ఫీల్ నో మ్యాజిట్ నో ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ అని తీర్పు ఇవ్వడంతో ఈమూవీ రెండవవారం కూడ నడవడం కష్టం అన్నకామెంట్స్ వస్తున్నాయి.
ఇక చాలాకాలం నుండి రిలీజ్ కోసం ఎదురు చూస్తూ నిర్మిమింపబడ్డ ఆంథాలజీ మూవీ ‘పంచతంత్రం’ గురించి రివ్యూలు బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి సినిమాలకు డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కుని ధియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అన్నసందేహాలు వస్తున్నాయి. బ్రహ్మానందం స్వాతి లాంటి మంచినటులు ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ రచనలో తెరకెక్కిన ‘ముఖచిత్రం’ ప్లాస్టిక్ సర్జరీల నేపథ్యంలో స్కామ్ ను థ్రిల్లింగ్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. ఈసినిమా చూసిన ప్రేక్షకులు ఈమూవీ ధియేటర్లలో కాకుండా ఓటీటీ లో డైరెక్ట్ గా రిలీజ్ అయితే బాగుండేది అని టాక్. ఇక చివరిగా విశ్వక్సేన్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘ముఖచిత్రం’ సినిమా గురించి కూడ పెద్దగా ఎవరు పట్టించుకోకపోవడంతో ఈవారం సినిమాలు చూడాలి అని అనుకునేవారికి ‘హిట్ 2’ తప్ప మారో ఆప్క్షన్ లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి