యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని తాజాగా ది వారియర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ పోతినేని డాక్టర్ గా మరియు పోలీస్ ఆఫీసర్ గా రెండు పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ కి తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి లింగు సామి దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా , ఆది పినిశెట్టిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే తెలుగు మరియు తమిళ భాషలో విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ లభించింది. దానితో ది వారియర్ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కలేదు. దానితో ది వారియర్ మూవీ కి 18 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ది వారియర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలైనప్పటికీ ఈ మూవీ లో  డాక్టర్ గానూ పోలీస్ ఆఫీసర్ గాను నటించిన రామ్ పోతినేని తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే ఈ రెండు పాత్రల్లో నటనకు గాను రామ్ పోతినేని కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ పోతినేని , బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: