తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ లో ఓ పెద్ద నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత వైవిధ్యమైన కథల ఎంపికలతో అందరు ఇష్టపడే స్టార్ హీరోగా దూసుకుపోయారు.. దూసుకుపోతున్నారు కూడా.. ఇక ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేస్తూ అలరించిన వెంకటేష్ ఈ మధ్యకాలంలో తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక నేడు వెంకటేష్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.టాప్ ప్రొడ్యూసర్ వారసుడుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన వెంకటేష్ కు సుమారుగా రూ. 2600 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. తండ్రి నుంచి వచ్చిన ఆస్తులతో కలిపితే మరో రూ.2000 కోట్లు ఉంటాయట.


ఇక అంతేకాదు వీటితోపాటు ఇల్లు, కార్లు ఇలా మొత్తం మీద వెంకటేష్ కి సుమారుగా రూ.5000కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఫిలిం స్టూడియోలో కూడా ఆయనకు సగం వాటా ఉందని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ ఆస్తుల వివరాలు తెలిసి ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు.ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్ ఒక్కో సినిమాకు మొత్తం రూ.10 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్లు  వార్తలు వినిపిస్తున్నాయి.సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్న విక్టరీ వెంకటేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈరోజు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా కరోనా టైంలో నిర్మాత సురేష్ బాబు నారప్ప సినిమాను నేరుగా ఓటీటీ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ  ఈరోజు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: