మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "ధమాకా" అనే రొమాంటిక్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా , త్రినాథ్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ధమాకా మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్రకటన ను ప్రకటించింది. 

ధమాకా మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ధమాకా మూవీ తో రవితేజ ఏ రేంజ్, విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే డిసెంబర్ 23 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: