ఇక దర్శక నిర్మాతలు అందరూ కూడా ఈ అమ్మడి అభినయానికి మంత్రముగ్దులు అయిపోయారు అని చెప్పాలి. దీంతో ఇక వరుస అవకాశాలు ఇస్తామంటూ ఈ అమ్మడి కోసం క్యూ కడుతున్నారు. దీంతో ఇక స్టార్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు కూడా ఇక తమ పక్కన శ్రీ లీల ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పెళ్లి సందడి సినిమా తర్వాత శ్రీలీలా హీరోయిన్గా నటించిన రెండో చిత్రం ధమాకా. రవితేజ హీరోగా తనకెక్కిన ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా ఈరోజే థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది అన్న విషయం తెలిసిందే.
21 ఏళ్ల వయసున్న శ్రీ లీల సీనియర్ హీరో అయిన రవితేజతో డీప్ రొమాన్స్ చేయడంపై కొంతమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు రవితేజకు శ్రీ లీలకు మధ్య 32 ఏళ్ల వయస్సు తేడా ఉంది. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది శ్రీ లీల. గతంలో శ్రీదేవి లాంటి హీరోయిన్స్ కూడా ఇలాగే చేశారు.. ఎన్టీఆర్ కి కూతురుగా నటించిన శ్రీదేవి అదే ఎన్టీఆర్ తో హీరోయిన్గా నటించింది. చాలామంది హీరోయిన్స్ విషయంలో ఇది జరిగింది. అప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు.. కానీ నేను చేస్తే మాత్రం తప్పు అయిపోయిందా అంటూ ట్రోలర్స్ కి శ్రీలీల గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి