ఈ క్రమంలోనే అటు సినిమాల పరంగా కూడా ఈయనకు భారీగా క్రేజీ పెరుగుతుందని చెప్పాలి . స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ , చిరంజీవి కూడా తమ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6వ తేదీ సాయంత్రం ఒంగోలులో నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ రాబోతున్నారు అని కూడా స్పష్టం అయింది.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ నిర్వహించబోతున్నారు? దీనికి ఎవరు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు? అనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే క్లారిటీ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి