టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు మహేష్. ఇక ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఒకప్పుడు విపరీతంగా స్మోక్ చేసేవాడట. అయితే కొంతకాలం తర్వాత సిగరెట్ తాగడం పూర్తిగా మానేసాడట. అయితే మహేష్ సిగరెట్ మానేయడానికి ఓ బలమైన కారణంతో పాటూ దాని వెనక పెద్ద కథే ఉందని అంటున్నారు. దాని వివరాలకు వెళ్తే.. గతంలో మహేష్ బాబు విపరీతంగా సిగరెట్లు తాగేవాడట.ఎంతలా అంటే ఒక్కరోజులోనే రెండు నుండి మూడు పెట్టాల సిగరెట్లు కాల్చేవాడట.

అంతేకాదు సినిమాల్లో కూడా మహేష్ సిగరెట్ తాగే సన్నివేశాలు చూసి అందరూ షాక్ అయిపోయేవారు. ఇక నమ్రతని పెళ్లి చేసుకున్నాక మహేష్ గుడ్ బాయ్ గా మారిపోయాడు. ఇక ఆ గుడ్ బాయ్ కాస్త పిల్లలు పుట్టగానే జెంటిల్మెన్ అయిపోయాడు. అయితే మహేష్ సిగరెట్లు మానేయడానికి ఓ బలమైన కారణం ఉందట. అంతేకాదు మహేష్ సిగరెట్ మానేయడం వెనక అతని ఫ్రెండ్ అసలు రీజన్ అని చెప్తారు. ఇంతకీ ఆ ఫ్రెండ్ మరెవరో కాదు అదొక పుస్తకం. మంచి పుస్తకం మంచి ఫ్రెండ్ లాంటిదని అంటుంటారు. అందుకే ఓ పుస్తకం చదవడం తర్వాత మహేష్ పూర్తిగా సిగరెట్లు త్రాగడం మానేశాడు.

 'అలెన్ కర్' అనే ఓ రచయిత రాసిన పుస్తకం యొక్క ప్రభావం మహేష్ బాబు పై బాగా పడిందట. ఆ పుస్తకాన్ని మహేష్ కి తన స్నేహితుడు గిఫ్ట్ గా ఇచ్చాడట. నో స్మోకింగ్ జోన్లో ఎలా వెళ్లొచ్చు అనేది ఆ పుస్తకంలో ఉందట. ఆ పుస్తకం చదివిన తర్వాత మహేష్ సిగరెట్లు త్రాగడం పూర్తిగా మానేసాడట. అంతేకాదు ఎప్పుడూ కూడా తన సన్నిహితులకు, అభిమానులకు పొగతాగవద్దంటూ చెబుతూ ఉంటాడట. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: