టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వీర సింహా రెడ్డి లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన శృతి హాసన్మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది.

వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో మైత్రి సినిమా సంస్థ నిర్మించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి మరో సాంగ్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయబోతుంది. 

మూవీ నుండి మాస్ మొగుడు అనే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ రోజు రాత్రి 7 గంటల 35 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ పై నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ లెవెల్లో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: