సినిమా పరిశ్రమలో వారసుల హవా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది సౌత్ ఇండియాలో ఉన్న అన్ని భాషలలోనూ మరియు బాలీవుడ్ లోనూ ఉంది. టాలెంట్ ఉన్నా లేకున్నా హీరో , హీరోయిన్ , నిర్మాత పిల్లలు ఇండస్ట్రీలోకి దూసుకు వస్తున్నారు. అలా వచ్చిన వారిలో కొందరు సక్సెస్ కాగా చాలా వరకు ఫెయిల్ అయిన ఉదాహరణలే ఎక్కువ ఉన్నాయి. అంతెందుకు నందమూరి కుటుంబం నుండి వచ్చిన తారకరత్న హీరోగా ఫెయిల్ అయ్యాడు, అల్లు కుటుంబం నుండి వచ్చిన శిరీష్ ఇంకా తడబడుతూనే ఉన్నాడు. అదే విధంగా అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన అఖిల్ కు కూడా సాలిడ్ హిట్ ఇంకా పడలేదు.

ఇప్పుడు మరో ఫ్యామిలీ నుండి వారసుడు హీరోగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఇప్పటికే వెంకటేష్ మరియు రానాలు నటులుగా వచ్చి సక్సెస్ అయ్యి దూసుకుపోతున్నారు. ఇప్పుడు రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా కొన్ని రోజుల్లో మన ముందుకు రానున్నాడు. సెన్సిబిల్ డైరెక్టర్ తేజ ఇతనిని వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకు అహింస అనే క్యాచీ టైటిల్ ను ఖరారు చేశారు. ఎప్పటిలాగే తేజ సినిమాకు ఆర్ పి పట్నాయక్ సంగీతాన్ని అందించాడు. ఇతను అందించిన పాటల వలనే ఈ సినిమాకు కొంత అయినా పాపులారిటీ వచ్చింది .

అయితే తమ్ముడు సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో రానా చొరవ తీసుకుంటున్నాడట. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చెయ్యాలి అన్న విషయంపై దగ్గుబాటి సురేష్ బాబు తో చర్చిస్తున్నాడట. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. మరి తమ్ముడి సినిమా కోసం రానా ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నది తెలియాలంటే అహింస రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే .  

మరింత సమాచారం తెలుసుకోండి: