మలయాళం స్టార్ హీరోయిన్ అయిన అపర్ణ బాలమురళికి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమెతో ఓ విద్యార్థి చాలా అనుచితంగా ప్రవర్తించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌గా మారింది. స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హాద్దురా సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ అపర్ణ బాలమురళి.ప్రస్తుతం ఆమె తాంకం అనే పేరుతో మలయాలంలో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ కాలేజీని మూవీ యూనిట్ విజిట్ చేసింది.ఇక ఆ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో వచ్చి అపర్ణ బాలమురళి భుజంపై చేయివేయడానికి ప్రయత్నించాడు. మొదట ఆమెకు ఫ్లవర్‌తో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్ ఆ తర్వాత ఆమె భుజంపై సెన్స్ లేకుండా చేయివేశాడు.ఇక ఆ స్టూడెంట్ ప్రవర్తనతో అపర్ణ బాలమురళి చాలా ఇబ్బందిగా ఫీలయ్యింది.ఇక ఆ స్టూడెంట్ నుంచి తప్పించుకోవడానికి కూడా ఆమె ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. 


ఆ టైంలో చిత్ర యూనిట్‌తో పాటు కాలేజీ యాజమాన్యం ఉన్నా కూడా ఆ స్టూడెంట్ చేస్తోన్న పనిని అడ్డుకోకపోవడంపై నెటిజన్లు ఇంకా అపర్ణ ఫ్యాన్స్ ఎంతగానో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ విషయంలో అపర్ణ బాలమురళికి సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ కూడా చేస్తున్నారు.అయితే ఆ స్టూడెంట్ వెంటనే క్షమాపణ అడిగినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం అదే ఆ స్టూడెంట్ కాకుండా ఏ హీరోనో లేక ప్రముఖులు అలా చేయి వేస్తే ఊరుకుంటారుగా.. ఒక సామాన్యుడు అభిమానంతో ఫోటో దిగడానికి చేయి వేస్తే ఊరుకోరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మలయాళంలో ఫుల్ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోన్న అపర్ణ బాలమురళి ప్రస్తుతం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్‌తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ధూమం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా మరో ఆరు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు మంచి జోరుమీదుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: