ఫిబ్రవరి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి సినిమాల హడావిడి తరువాత వచ్చే ఈనెల కోసం చాల చిన్న మీడియం రేంజ్ సినిమాలు ఎదురు చూస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి చిన్న సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీ పడటమే కాకుండా ఏకంగా వారానికి నాలుగు ఐదు సినిమాలు విడుదల అవుతూ క్యూ కడుతూ ఉంటాయి. అయితే ఈ ఫిబ్రవరికి మరొక ప్రత్యేకత ఉంది.ఎవరూ ఊహించని విధంగా ఇన్ని చిన్న సినిమాల మధ్య ఒక సినిమా బ్లాక్ బష్టర్ హిట్ అయి ఆమూవీని కొనుక్కున్న బయ్యర్లకు అధిక లాభాలను తెచ్చిపెడుతుంది. గత సంవత్సరం ఇదే ఫిబ్రవరిలో విడుదలైన ‘డీజే టిల్లూ’ ఆముందు సంవత్సరం విడుదలైన ‘జాంబిరెడ్డి’ సూపర్ సక్సస్ లు అందుకుని ఇండస్ట్రీ విశ్లేషకుల అంచనాలను కూడ తలక్రిందులు చేసాయి.ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అలాంటి సంచలనం ఏచిన్న సినిమా చేయబోతోంది అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. ఈనెల మొదటి వారంలో ‘రైటర్ పద్మభూషణ్’ ‘మైఖేల్’ ‘బుట్టబొమ్మ’ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 3 సినిమాలపై అంచనాలున్నాయి. ‘కలర్ ఫొటో’ స్థాయిలో ‘రైటర్ పద్మభూషణ్’ సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఈ నెల రెండో వారంలో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ విడుదల కాబోతోంది. ‘బింబిసార’ తర్వాత విడుదలకాబోతున్న సినిమా అవ్వడంతో ఈ మూవీ పై కూడ అంచనాలు చాల ఎక్కువగా ఉన్నాయి.అంతేకాదు ‘సర్’ ‘వినరోభాగ్యము విష్ణుకథ’ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలు కూడా ఈనెలలోనే వస్తున్నాయి. విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా పై కూడా అంచనాలు బాగా ఉన్నాయి. ఈసినిమాలతో పాటు సమంత నటించిన ‘శాకుంతలం’ ఇదే నెల విడుదల కావలసి ఉన్నప్పటికీ రకరకాల కారణాలతో ఈమూవీ విడుదల మళ్ళీ వాయిదా పడింది అంటున్నారు. ఇప్పుడు ఇన్ని చిన్న సినిమాల మధ్య ఏచిన్న సినిమా ఊహించని బ్లాక్ బష్టర్ హిట్ కొడుతుందో తెలియక బయ్యర్లకు ఒక లాటరీ టిక్కెట్ లా మారింది అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: