నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కిరిక్ పార్టీ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె చలో అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈమె అనంతరం స్టార్ హీరోల సరసన వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరింది.స్టార్ హీరోల సరసన ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలు అవడంతో ఈమెకి మరింత గుర్తింపు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుతో సరిలేరు నీకు ఎవరు బన్నీతో పుష్ప వంటి సినిమాలు చేసి పాన్ ఇండియా హీరోయిన్గా కూడా మంచి క్రేజ్ను సంపాదించుకుంది.

పుష్ప సినిమాతో రష్మిక మందనకి భారీ రేంజ్ లో ఆఫర్లు రావడం జరిగింది. ఏకంగా బాలీవుడ్లో సైతం సినిమాలు చేసేందుకు సైన్ చేసింది ఈమె. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది రష్మిక. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా నుండి రష్మిక మందనను తొలగించినట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల రష్మిక మందన నటించిన మిషన్ మజ్ను సినిమా రిసల్ట్ చూసి కొరటాల శివ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ మధ్యకాలంలో రష్మిక మందన వరుస వివాదాలలో చిక్కుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంది అనే భయంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం.ఈ వార్త విన్నానంతరం చాలామంది రష్మిక మందనకి మరో కోలుకోలేని దెబ్బ పడింది అన్నట్లుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన గుడ్ బాయ్ మిషన్ మజ్ను సినిమాలతో డిజాస్టర్ ను అందుకుంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా నుండి కూడా తప్పుకోవడంతో నిజంగానే రష్మిక మందనకి బ్యాడ్ టైం నడుస్తోంది అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: