ఇక నాని ఏ సినిమా చేసిన ఇక ఆ సినిమాలోని పాత్రకు తన నటనతో ప్రాణం పోస్తాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇకపోతే ఇక ఇప్పుడు నాని దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమా గా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. దాదాపు 40 నుంచి 50 కోట్ల వరకు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇక ఇప్పుడు నాని మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అనేది తెలుస్తుంది.
గతంలో తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు తోనే మరోసారి సినిమా చేసేందుకు నాచురల్ స్టార్ నాని సిద్ధమైపోయాడట. త్వరలోనే ఇక ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లు టాక్ చక్కర్లు కొడుతుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు అంటే సుందరానికి అనే సినిమాతో నానికి ఫ్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయ. ఇక అంతకుముందు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరుడా అనే డిఫరెంట్ కామెడీ సినిమాలను తెరమీదకి తీసుకొచ్చాడు. నానితో సినిమాకు చాన్స్ దక్కించుకున్నాడు. కానీ అంటే సుందరానికి సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నిర్మాతలకు నష్టాలన్నీ తెచ్చిపెట్టింది. అయినప్పటికీ ఇప్పుడు నాని మరోసారి వివేక్ ఆత్రేయకు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి